రతన్ టాటా ల‌వ్ స్టోరీ వింటే నిజంగా క‌న్నీరే

రతన్ టాటా ల‌వ్ స్టోరీ వింటే నిజంగా క‌న్నీరే

0
87

రతన్ టాటా పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని తన చేత్తో ముందుకు నడిపిన వ్యాపారవేత్త. అయితే ఎవరికి అయినా కచ్చితంగా జీవితంలో ప్రేమ అనేది ఉంటుంది.. ఆయ‌న‌కు కూడా ఓ ల‌వ్ స్టోరీ ఉంద‌ట.. తాజాగా ఆయ‌న ఈ విష‌యం తెలిపారు.

కాలేజీలో చదువు పూర్తైన తర్వాత లాస్ ఏంజెలెస్ లో ఒక ఆర్కిటెక్చర్ కంపెనీలో ఉద్యోగిగా చేరార‌ట‌. అక్కడ రెండేళ్ల పాటు నేను పని చేశా. అప్పటి రోజులు సంతోషంగా గడిచిపోయాయి. వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదంగా ఉండేది. నాకు సొంత కారు కూడా ఉండేది. నా ఉద్యోగాన్ని నేను ఎంతో ప్రేమించేవాడిని. అని తాజాగా ఓ కార్య‌క్ర‌మంలో తెలిపారు.

అంతేకాదు ఈ స‌మ‌యంలో అక్క‌డ ఓ మ‌హిళ‌తో ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా దారితీసింది, అక్క‌డ నుంచి పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు, ఆయ‌న నాయ‌న‌మ్మ ఆరోగ్యం బాగాలేక కొద్ది రోజులు పెళ్లిని వాయిదా వేశారు, ఈ స‌మ‌యంలో 1962 ఇండో-చైనా యుద్ధం స‌మ‌యం.. అయితే ఆ స‌మ‌యంలో ఆమె త‌ల్లిదండ్రులు మా వివాహానికి ఒప్పుకోలేదు.. అలా ప్రేమ‌ని మిస్ అయ్యాను అని చెప్పారు ఆయ‌న‌, ఇక బ్ర‌హ్మ‌చారిగానే ఉన్నారు ర‌త‌న్ టాటా .. ఆయ‌న వ‌య‌సు 82 ఏళ్లు.