ఏపీలో వైసీపీ సర్కారు పాలనపై నిత్యం విషం కక్కుతూనే ఉంటారు అని ఎల్లో మీడియాని విమర్శిస్తూ ఉంటారు వైసీపీ నేతలు, అయితే తాజాగా వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ కోసం కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీని కలిశారు, మూడు రాజధానుల విషయం తెలిపారు. ఉగాదికి పేదలకు 25 లక్షల ఇళ్లస్ధలాల పట్టాలు ఇవ్వనున్నాము అని తెలిపారు.
ఆయనని ఆహ్వానించారు, అంతేకాదు శాసనమండలి రద్దు బిల్లుకి ఆమోదముద్ర పడేలా చూడాలి అని కోరారు కాని దీనిపై ఎల్లో మీడియా వార్తలు వేరుగా ఉన్నాయి దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు.
చంద్రబాబు సీఎంగా లేని ఏపీ నాశనమైపోవాలని కిరసనాయిలు కోరుకుంటున్నాడని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీతో రాష్ట్ర సమస్యలపై చర్చిస్తూ ముఖ్యమంత్రి జగన్ గంటన్నర సేపు సమావేశమయ్యారని…. అయితే, పీపీఏలపై జగన్ ను మోదీ మందలించారంటూ సైనైడ్ వార్తలను కుమ్మరించారని మండిపడ్డారు. జయము జయము చంద్రన్నా అనే భజన పరాకాష్ఠకు చేరిందని విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.