ప్రస్తుతం రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ చిత్రం చేస్తున్నారు, ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానుంది ఇక మరో నాలుగు నుంచి ఐదు నెలల్లో షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోనుంది, అయితే ఇప్పటి వరకూ ఈ సినిమాపై ఫోకస్ పెట్టిన రాజమౌళి ఇక సినిమా తర్వాత మరో సినిమాని కూడా లైన్ లో పెట్టాలి అని చూస్తున్నారు..
అయితే ఈ సారి బాహుబలి లెవల్లో, పీరియాడికల్ చిత్రంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తారు అని తెలుస్తోంది, ఇప్పటికే చిత్రం గురించి డిస్కషన్ కూడా జరిగిందట, ఇద్దరూ కూడా ఈ చిత్రానికి ఒకే చెప్పారు అని తెలుస్తోంది.
అయితే అప్పుడే ఎక్కడా ఈ చిత్రం పై ప్రకటన చేయడం లేదు వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది అని తెలుస్తోంది, మహేష్ బాబుతో రాజమౌళి సినిమా గతంలోనే రావాలి కాని అప్పుడు కుదరలేదు, తాజాగా వీరిద్దరూ సినిమా చేయనున్నారట. కేఎల్ నారాయణ నిర్మాతగా ఓ చిత్రాన్ని రాజమౌళి గతంలో అంగీకరించారు . రాజమౌళి తరువాతి సినిమా ఇదేనని, ఇదే చిత్రంలో ప్రభాస్ కూడా ఉంటారని, యూవీ క్రియేషన్స్ బ్యానర్ కూడా నిర్మాతగా ఉంటుందని తెలుస్తోంది, సో దీనిపై ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే.