చిరు వైసీపీలో చేరికపై క్లారిటీ ఇస్తూనే మెలికపెట్టిన మంత్రి బొత్స…

చిరు వైసీపీలో చేరికపై క్లారిటీ ఇస్తూనే మెలికపెట్టిన మంత్రి బొత్స...

0
74

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన మెగా స్టార్ చిరంజీవి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని ఇటీవలే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే… వాస్తవానికి గత సంవత్సరం నాటినుంచి ఆయన వైసీపీలో చేరనున్నారని వార్తలు వస్తున్నాయి…

చిరంజీవి వైసీపీలో చేరితే ఆయనకు రాజ్యసభ సీటును ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ కూడా సిద్దంగా ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి… కానీ ఆయన వైసీపీలో చేరలేదు… వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో చిరు వైసీపీకి సపోర్ట్ గా నిలిచారు… అందులో ప్రధానమైనది త్రీ క్యాపిటల్స్ మద్దతు…

దీంతో మరోసారి చిరు వార్తల్లో నిలిచారు… ఇక తాజాగా ఆయన వైసీపీలో చేరుతారనే వార్తలపై మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు… పార్టీలో చేరడం అనేది చిరంజీవి ఇష్టం అని ఒక వేళ ఆయన వైసీపీలో చేరితే ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని బొత్స సమాధానం ఇచ్చారు…. అలాగే ఎన్డీఏలో చేరాలన్న ప్రతిపాదన వస్తే పరిశీలిస్తామని బొత్స అన్నారు..