పెను ప్రమాదం నుంచి బయట పడ్డ సీఎం జగన్ బావ…

పెను ప్రమాదం నుంచి బయట పడ్డ సీఎం జగన్ బావ...

0
93

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బావ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ కు తాజాగా పెను ప్రమాదం తప్పింది… ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ పై నుంచి దూసుకెళ్లి రోడ్డు పక్కన ఉన్న వాలు ప్రదేశంలోకి చొచ్చుకుపోయింది…

ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ద్వంసమైది… అనిల్ కుమార్ గన్ మెన్ కు అలాగే డ్రైవర్ కు గాయాలు అయ్యాయి…. ఇక విషయం తెలుకున్న ప్రభుత్వ విప్ ఉదయభాను హుటా హుటీన ప్రమాద స్థలానికి చేరుకున్నారు… అనిల్ కుమార్ తో పాటు గాయపడిన వారిని విజయవాడలోని ఎంజే నాయుడు ఆసుపత్రికి తరలించారు…

వారికి అక్కడ ప్రథమ చికిత్సలు అందించారు ప్రథమ చికిత్స తర్వాత అనిల్ కుమార్ తన పర్యటనకు వెళ్లిపోయారు… జాతీయ రహారిపై వేగాన్ని నియత్రించేందుకు బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు ఆ బ్యారికేడ్లను తప్పించబోయే ప్రయత్నంలో కారు అదుపు తప్పినట్లు తెలుస్తోంది…