మల్టీస్టార్ సినిమాలకు క్రేజ్ పెరిగిపోతుంది . దీంతో మల్టీస్టార్ చిత్రాలలో నటించేందుకు యంగ్ హీరోలు మొదలుకొని సీనియర్ హీరోల వరకు ప్రతి ఒక్కరు ఆసక్తిని చూపుతున్నారు. ఈ క్రమంలో యంగ్ హీరో రామ్ కూడా మల్టీస్టారర్ చిత్రంలో నటించేందుకు ఆసక్తిని చూపుతున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. స్రవంతి రవికిశోర్ నిర్మించబోయే ఈ చిత్రంలో ఓ తమిళ హీరోతో పాటు రామ్ నటించనున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ప్రస్తుతం రామ్ హలో గురు ప్రేమ కోసమే అనే చిత్రంలో నటించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తమిళ హీరోతో రామ్ మల్టీస్టారర్ మూవీ
తమిళ హీరోతో రామ్ మల్టీస్టారర్ మూవీ