చిరంజీవికి ఇష్టమైన దర్శకుడు మృతి షాకైన మెగా కుటుంబం

చిరంజీవికి ఇష్టమైన దర్శకుడు మృతి షాకైన మెగా కుటుంబం

0
89

కొంత కాలంగా టాలీవుడ్ లో విషాద సంఘటనలు జరుగుతున్నాయి…తాజాగా టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ మృతి చెందారు. ఆయన మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం పునాదిరాళ్లు చిత్రానికి దర్శకుడు.. ఈసినిమాకి ఏకంగా ఐదు నంది అవార్డులు కూడా ఆయనకు వచ్చాయి, తర్వాత ఆయన దర్శకుడిగా మా శ్రీమల్లి అనే చిత్రం చేశారు.. తర్వాత తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నారు.

ఇటీవల ఆయన అనారోగ్యంతో ఉన్నారు అని తెలుసుకున్న చిరంజీవి ఆయనకు అపోలోలో చికిత్స అందించారు.. మెడిసన్ ఇచ్చారు .. కోలుకుంటున్నారు అనుకుంటున్న సమయంలో ఆయన మరణించారు అనే విషయం మెగా ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేసింది. ఆయన చికిత్స తీసుకుంటూ శనివారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామం విజయవాడ సమీపంలోని ఉయ్యూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆయనకు ఓ భార్య, ఇద్దరు కుమారులు ఉండగా.. భార్య, పెద్ద కుమారుడు అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పటినుంచి ఒంటరిగా ఉంటున్నారు. పెద్దగా సంపాదన లేకపోవడంతో ఆర్ధిక ఇబ్బందులు కూడా ఆయనని వేధించాయి అంటున్నారు.
ఇప్పటికీ అద్దె ఇంట్లో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఆయన మృతితో టాలీవుడ్ లో విషాదం నెలకొంది.