పెళ్లిలో విషాదం అలముకుంది, ఆ కుటుంబంలో సభ్యులు అప్పటి వరకూ ఎంతో సంతోషంగా ఉన్నారు, పెళ్లి కొడుకు పెళ్లికూతురు కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు, కాని ఈ సమయంలో బోధన్ పట్టణంలోని బ్రాహ్మణ గల్లీలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి ఊరేగింపులో డాన్స్ చేస్తూ పెళ్లి కొడుకు గణేష్ గుండెపోటుతో మృతి చెందాడు.
దీంతో పెళ్లి అయిన 24 గంటలు గడవక ముందే వరుడు ఇలా చనిపోవడంతో వారు కన్నీటి పర్యంతం అయ్యారు .. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న ఆమె కన్నీరు మున్నీరు అయింది, వారి కుటుంబం బాధ కంటితడిపెట్టిస్తోంది, శుక్రవారం మధ్యాహ్నం గణేష్ వివాహం జరిగింది. దీనిలో భాగంగా రాత్రి ఘనంగా బారాత్ నిర్వహించారు.
బారాత్లో డాన్స్ చేస్తున్న గణేష్.. డీజే సౌండ్కు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో గణేష్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని బంధవులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో గణేష్ చికిత్స పొందుతూ అర్ధరాత్రి 2 గంటల సమయంలో గణేష్ మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు, దీంతో అందరూ షాక్ అయ్యారు. అయితే ఇలా తమ స్నేహితుడు ఆనంద సమయంలో కళ్లు మూయడంతో స్నేహితులు కూడా కన్నీరు పెట్టుకున్నారు.