ఢిల్లీకి టీడీపీ నేతలు ఎవరిని కలవనున్నారంటే

ఢిల్లీకి టీడీపీ నేతలు ఎవరిని కలవనున్నారంటే

0
68

ఓవైపు ముఖ్యమంత్రి జగన్ ఇటీవల హస్తిన వెళ్లారు.. అక్కడ ప్రధాని నరేంద్రమోదీని మంత్రి అమిత్ షా న్యాయశాఖ మంత్రిని కూడా కలిసి వచ్చారు ముఖ్యంగా ప్రత్యేకహోదా విషయం అలాగే ఏపీకి రావలసిన నిధులు అలాగే ఏపీలో పలు సంక్షేమ పథకాల గురించి తెలిపారు, అయితే శాసనమండలి రద్దు అంశం అలాగే మూడు రాజధానుల నిర్ణయం ఇవన్నీ కూడా చర్చించారు.

ముఖ్యంగా ఏపీలో శాసనమండలి రద్దు విషయంలో కేంద్రం నుంచి త్వరితగతిన ఆ బిల్లు పాస్ చేయించాలి అని కోరారని తెలుస్తోంది.. అయితే వచ్చే నెలలోనే శాసనమండలి రద్దు అవుతుంది అని వార్తలు వస్తున్నాయి, ఇక దీనిపై ఏపీలో టీడీపీ నేతలు వేరుగా చెబుతున్నారు.

రాజధాని అంశంపై సెలెక్ట్ కమిటీ డాక్యుమెంట్స్ మళ్లీ వెనక్కి పంపడం రాజ్యాంగ విరుద్ధమని యనమల తెలిపారు. అసలు ఇలా చేయరని తెలిపారు…శాసన పరిషత్ కార్యదర్శిపై చర్యలు తీసుకొనే అధికారం మండలి ఛైర్మన్కు ఉందని చెప్పారు. దీనిని మేము వదిలిపెట్టం కచ్చితంగా తమ పార్టీ తరపున ఎమ్మెల్సీలు ఢిల్లీకి వెళ్లి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతికి ఈ వాస్తవ విషయాలు తెలియచేస్తాం అన్నారు. వైసీపీ చేసేది పద్దతి కాదని రాజ్యంగ విరుధ్దంగా వీరి చర్యలు ఉంటున్నాయి అని విమర్శించారు.