ప్రియాంక గాంధీకి రాజ్యసభ సీటు ఎక్కడనుంచంటే

ప్రియాంక గాంధీకి రాజ్యసభ సీటు ఎక్కడనుంచంటే

0
88

కాంగ్రెస్ పార్టీలో ఇక సీనియర్లకు రెస్ట్ ఇచ్చి పార్టీని జూనియర్లకు అప్పచెబితే కాని ఆ పార్టీ ముందుకు వెళ్లదు అంటున్నారు చాలా మంది.. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గత ఆరు సంవత్సరాలుగా దారుణమైన ఫలితాలు చూస్తుంది… మూడు రాష్ట్రాల ఎన్నికల్లో మాత్రమే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది.. ఇది పెద్ద విజయంగా కాంగ్రెస్ పార్టీ భావించడం లేదు.

అయితే రాహుల్ గాంధీకంటే ఆయన సోదరి ప్రియాంక గాంధీకి పార్టీ పగ్గాలు ఇవ్వాలి అని డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.. అయితే కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాజకీయంగా ఇప్పుడు యాక్టీవ్ అయ్యారు.. అంతేకాదు ఆమెకి ఇప్పుడు రాజ్యసభ సీటు కూడా రానుంది అని తెలుస్తోంది.

ఆమెని ఎంపీగా పంపాలి అని పెద్దల సభలో అవకాశం కల్పించాలి అని చూస్తున్నారట…పెద్దల సభలో మొత్తం 245 స్థానాలు ఉన్నాయి వాటిలో 68 ఏప్రిల్ లో ఖాళీ అవుతాయి.. అందులో మిత్ర పక్షాల సహకరాంలో 10 కాంగ్రెస్ కు వస్తాయి.. అందులో ఓ స్ధానం నుంచి ఆమెని ఎంపిక చేయనున్నారట… అధికారంలో ఉన్న మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఆమెని ఎక్కడ నుంచి రంగంలోకి దింపి నామినేట్ చేస్తుందో చూడాలి.