బాబుపై సీమలో సీఎం జగన్ సటైర్లు – ఎల్లో మీడియాకి ఝలక్

బాబుపై సీమలో సీఎం జగన్ సటైర్లు - ఎల్లో మీడియాకి ఝలక్

0
76

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలులో మూడో విడత కంటివెలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సమయంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.. అలాగే మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు పై సటైర్లు వేశారు. తాము ప్రజల కోసం మంచి పథకాలు అమలు చేస్తున్నా అందరికి సంక్షేమ ఫలాలు అందచేస్తున్నాం అని తెలిపారు.

కాని కొందరు దీనిపై కావాలనే విషం చల్లుతున్నారు.. కడుపు మంటతో రెచ్చిపోతున్నారు అని విమర్శించారు సీఎం జగన్ . తాము చేస్తున్న సంక్షేమం చూసి కొందరు అసూయపడుతున్నారంటూ, దేనికైనా మందు ఉంటుందేమో కానీ అసూయ మంటలకు మందు ఉండదని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై సెటైర్లు వేశారు..

కొన్ని పత్రికలు మీడియాలు కావాలనే మంటతో విషపు రాతలు రాస్తున్నాయి వారి కడుపు మంట చల్లారడానికి మందులు ఉండవు అని సటైర్ వేశారు, కంటికి సమస్యలు వస్తే నయం చేయవచ్చని, కానీ చెడు దృష్టిని నయం చేయలేమని అన్నారు. వయసు మళ్లితే ఫర్వాలేదని, మెదడు కుళ్లితే కష్టమని తెలిపారు ఆయన.