సీఎం జగన్ కి లేఖ రాసిన ఉండవల్లి ప్లీజ్ ఈ పని చేయండి

సీఎం జగన్ కి లేఖ రాసిన ఉండవల్లి ప్లీజ్ ఈ పని చేయండి

0
104

ఏపీలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు, మూడు ప్రాంతాలు అభివృద్ది చెందాలి అని ఆయన కాంక్షించారు, అయితే ఇక్కడ అమరావతిలో హైకోర్టు తాత్కాలికంగా నిర్మించారు.. అక్కడ స్పెషల్ చెంచ్ గా దానిని మారుస్తారు.. ఇక కర్నూలులో ఏపీ హైకోర్టు ఏర్పాటు చేయనున్నారు, దీని వల్ల రాయలసీమ ప్రాంతం కూడా డవలప్ అవుతుంది అని భావించారు.

అన్నీ ఒకే చోట ఉండటం కంటే వికేంద్రీకరణ చేస్తే అన్నీ ప్రాంతాలు అభివృద్ది చెందుతాయి అని భావించారు సీఎం జగన్.. అయితే తాజాగా విశాఖలో కూడా ప్రత్యేక హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తారు అని వార్తలు వస్తున్నాయి, ఈ సమయంలో
రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ సీఎం జగన్కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ లేఖ రాశారు.

ఈ మధ్య సీఎం జగన్ పాలనపై కామెంట్లు చేస్తున్న మాజీ ఎంపీ ఉండవల్లి తాజాగా జగన్ కు లేఖ రాయడం పై అందరూ చర్చించుకుంటున్నారు, 14 ఏళ్ల క్రితమే దీనిపై వైఎస్సార్ ఆలోచన చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. హైకోర్టు బెంచ్కు రాజమండ్రి అనుకూలమని లేఖలో ఆయన పేర్కొన్నారు. రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటును పరిశీలించాలని సీఎం జగన్ను ఉండవల్లి కోరారు. మరి సీఎం జగన్ దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.