జగన్ కు షాక్… కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చిన ఉండవల్లి….

జగన్ కు షాక్... కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చిన ఉండవల్లి....

0
85

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది… ఇప్పటికే మూడు రాజధానుల ప్రకటనతో రాజధాని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తరుణంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరోషాక్ ఇచ్చారు…

రాజమండ్రిలో హైకోర్ట్ బెంచ్ ను ఏర్పాటు చేయాలని కోరారు….ఈ మేరకు ఆయన జగన్ మోహన్ రెడ్డికి లేఖ కూడా రాశారు… ఈ లేఖలో ప్రధానంగా రాజమండ్రిలో హైకోర్ట్ బెంచ్ ను ఏర్పాటు చేయాలని కోరారు… హైకోర్ట్ బెంచ్ కు రాజమండ్రి అనుకూల ప్రదేశమని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు…

సుమారు 14 సంవత్సరాల క్రితమే వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు పై ఆలోచన చేశారని అన్నారు… అందుకే ముఖ్యమంత్రి జగన్ రాజమండ్రి హైకోర్ట్ బెంచ్ గురించి ఆలోచన చేయాలని లేఖలో పేర్కొన్నారు…