వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ సీట్లపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు… దాదాపు 20 మంది వరకూ ఈ ఐదు సంవత్సరాల్లో తమకు ఎమ్మెల్సీలుగా అవకాశం వస్తుంది అని అనుకున్నారు.. కాని వారికి ఇప్పుడు మండలి రద్దుతో ఆశలు అడియాశలు అయ్యాయి ..మరో పక్క జగన్ వారికి రాజ్యసభ సీట్లు ఇచ్చే ఛాన్స్ ఉండకపోవచ్చు ..కొందరు పారిశ్రామిక వేత్తలు కూడా ఇందులో లైన్ లో ఉంటారు.
అయితే ఇప్పుడు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తాను అని చెప్పిన జగన్, వారిలో ఇద్దరికి అయినా వచ్చే ఏడాదిలోపు రెండు రాజ్యసభ సీట్లు వారికి కేటాయిస్తార. కాని ఎమ్మెల్సీ లుగా తెలుగుదేశం పార్టీలో అయితే ఇప్పుడు ఉన్న వారు అందరూ పదవి కోల్పోతారు.
ఇలా చాలా మందికి ఇప్పుడు ఇది పెద్ద సమస్యగా మారింది.. ఇటు జగన్ కు కూడా పార్టీ తరపున ఈ విషయంలో కాస్త ఇబ్బందే పడుతున్నారు, కాని ఆయనకు వచ్చే కాలంలో పదవులు ఇచ్చే ఛాన్స్ ఉంది, అది టీడీపీకి లేదు, ఇక పార్టీ కోసం కష్టపడిన వారికి కొత్త పదవులు క్రియేట్ చేయాలి అని చూస్తున్నారు,