బోయ‌పాటికి బాల‌య్య స‌ల‌హా కొత్త‌వారికి ఛాన్స్

బోయ‌పాటికి బాల‌య్య స‌ల‌హా కొత్త‌వారికి ఛాన్స్

0
84

బోయ‌పాటి శ్రీను తాజాగా బాల‌య్య బాబుతో సినిమా చేస్తున్నారు, అయితే ఈ సినిమాలో బాల‌య్య బాబు డిఫ‌రెంట్ లుక్ లో కనిపించ‌నున్నారు..ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా, త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. బాలకృష్ణ పాత్రను బోయపాటి చాలా కొత్తగా డిజైన్ చేశారనీ ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి, అలాగే ఆయ‌న కాస్త లుక్ కూడా త‌గిన విధంగా మార్చుకున్నార‌ట‌.

ఈ సినిమాలో బాల‌య్య ప‌క్క‌న కథానాయిక కోసం ముందుగా నయనతారను సంప్రదించారు. డేట్స్ ఖాళీ లేవనే సమాధానం నయనతార నుంచి వచ్చిందట.. త‌ర్వాత శ్రియ‌ని అడిగారు కాని ఆమె ఆస‌క్తి చూపించ‌లేదు, అయితే కేథ‌రిన్ పేరు వినిపించింది, ఇక అంజ‌లి పేరు వినిపించింది ఇలా పేర్లు వినిపిస్తున్నాయి కాని ఎవ‌రిని ఫైన‌ల్ చేయ‌లేదు.

ఇలా సీనియర్ హీరోయిన్స్ అందుబాటులో లేకపోవడం గురించి బాలకృష్ణతో బోయపాటి మాట్లాడటంతో అసహనానికి లోనైన బాలకృష్ణ, కొత్త వాళ్లను తీసుకోమని కాస్త గట్టిగానే చెప్పారట. అందుకే బాల‌య్య కోరిక మేర‌కు ఈ చిత్రంలో కొత్త భామ‌ని తీసుకోనున్నార‌ట‌, అందుకే ముంబై ముద్దుగుమ్మ‌ల పిక్స్ చూస్తున్నార‌ట. ఇద్ద‌రిని చూశార‌ని వారిలో ఒక‌రిని ఫైన‌ల్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట బోయ‌పాటి బాలయ్య‌.