విజయ్ దేవరకొండతో మరో హిట్ డైరెక్టర్ సినిమా

విజయ్ దేవరకొండతో మరో హిట్ డైరెక్టర్ సినిమా

0
78

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫైటర్ సినిమా చేస్తున్నారు.. పూరి ఈ చిత్రాన్ని సెట్స్ పై పెట్టారు.. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ కూడా చిత్ర నిర్మాణంలో భాగంగా ఉన్నారు.. దాదాపు 60 కోట్ల రూపాయల బడ్జెట్ లో ఈ సినిమా తీస్తున్నారు.. అంతేకాదు తెలుగుతో పాటు హిందీ తమిళ .. మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇక అర్జున్ రెడ్డి మార్కెట్ ఈ చిత్రంతో మరింత పెరగనుంది అని చెప్పాలి.

ఇక పూరి కూడా ఈ కథపై చాలా ఇంట్రస్ట్ చూపించారు, ఇక పూరి చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ మరో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు, ఆయన హిట్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారట.. ప్రస్తుతం మారుతి ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్టు పైనే కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు.

ఇక గత ఏడాది చివరన మారుతి దర్శకత్వం వహించిన చిత్రం ప్రతిరోజూ పండగే ఈ విజయం చాలా సక్సెస్ తీసుకువచ్చింది, దీంతో వరుసగా ఆయన కథలు కూడా రాస్తున్నారు, ఇక ఈ సమయంలో మారుతి విజయ్ కు కథ రాశారట లైన్ బాగుంది అని విజయ్ కూడా ఒకే చెప్పారట ఈ కథపై ఇప్పుడు మారుతి వర్క్ చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి.