మ‌రో ప్రేమ జంటపై కత్తితో దాడి

మ‌రో ప్రేమ జంటపై కత్తితో దాడి

0
126

తెలంగాణ లో ప్రణయ్ పరువు హత్య మరువక ముందు ఈ రోజు హైదరాబాద్ లో మరో దారుణమైన సంఘటన జరిగింది. గత నెలలో ప్రేమ పెళ్లి చేసుకున్న నవ జంట మాధవి, సందీప్‌పై అమ్మాయి మేనమామ మనోహర చారి కత్తితో దాడి చేసాడు. ఈ దాడికి ముందు ఈ రోజు ఈ మధ్యాహ్నం సందీప్ ఇంటికి వెళ్లి మాధవిని తమతో పంపాలని కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడంటా. కాని మాదవి మేనమామతో ఇంటికి వచ్చేందుకు ఒప్పుకోలేదట.

అనంతరం వారు బయటికి రావడం గమనించిన మనోహర చారి వారిని బైక్‌పై అనుసరించి గోకుల్ థియేటర్ వద్దకు వెళ్లగానే ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. ఆ తరువాత అక్కడి నుంచి పరారయ్యాడు నిందితుడు. ఈ దాడిలో సందీప్, మాధవికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ తరువాత అక్కడి స్థానికులు మాధవి, సందీప్‌ లను సనత్ నగర్ దగ్గరలోని నీలిమ హాస్పిటల్ లో జాయిన్ చేసారు. కానీ ఈ దాడిలో మాదవి తీవ్రగా గాయపడటం వలన ఆమె పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.