50 వేలకు చేరుకోనున్న బంగారం ఎప్పుడో తెలుసుకోండి

50 వేలకు చేరుకోనున్న బంగారం ఎప్పుడో తెలుసుకోండి

0
95

చైనాలో కరోనా వైరస్ ఎఫెక్ట్ తో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి.. ఎవరూ షేర్ల లో పెట్టుబడులు పెట్టడం లేదు.. ఓ పక్క మార్కెట్లు డౌన్ ఫాల్ అవుతున్నాయి.. దీంతో షేర్లలో పెట్టుబడి పెట్టినా అవి ఎప్పుడు తగ్గిపోతాయా అని భయం వెంటాడుతోంది…ఇప్పటికే చైనా జపాన్ మార్కెట్లు చాలా వరకూ నష్టాల్లో నడుస్తున్నాయి.

అందుకే అన్నీ దేశాలు చాలా వరకూ పెట్టుబడికి బెస్ట్ గా బంగారం భావిస్తున్నారు, బంగారంలో పెట్టుబడి పెట్టాలి అని చూస్తున్నారు.. అందుకే బంగారం 45 వేల మార్క్ చేరుకుంది.. పది గ్రాములు 44 వేలు దాటేసి 45 వేల చేరువలో వెళుతోంది.. అయితే ఇప్పుడు బంగారం ధర తగ్గే అవకాశాలు ఉన్నాయా అంటే బులియన్ ట్రేడ్ పండితులు చెప్పే దాని ప్రకారం లేవంటున్నారు ..

మరో వారంలో ఇలా ట్రెండ్ ఉంటే 50 వేలకు పది గ్రాములు చేరుతుంది అంటున్నారు. కరోనా వైరస్ ఎఫెక్ట్ తగ్గిన తర్వాత కంపెనీలు బాగా రన్ అయి షేర్ల వాల్యూ పెరిగితే, బంగారం ధర తగ్గే అవకాశాలు ఉన్నాయని.. కొనుగోళ్లు కూడా భారీగా ఉండటంతో ఎక్కడా ధర తగ్గడం లేదు అంటున్నారు వ్యాపారులు.