చంద్రబాబు, లోకేశ్ కలిసి ఆ ఎంపీని అంతమొందించేందుకు చూస్తున్నారా…

చంద్రబాబు, లోకేశ్ కలిసి ఆ ఎంపీని అంతమొందించేందుకు చూస్తున్నారా...

0
110

తనుకు ఏమైనా జరిగితే మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే ఆయన కుమారుడు లోకేశ్ లదే బాధ్యత అని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగామ సురేష్ అన్నారు..

తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిన్న ఆయనపై జరిగిన దాడిపై స్పందించారు… చంద్రబాబు ఆయన కుమారుడు తనను అంతం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు…

తనకు ఏమైనా జరిగితే చంద్రబాబు ఆయన కుమారుడు లోకేశ్ లదే బాధ్యత అని సురేష్ అన్నారు… అమరావతి జేఏసీ ముసుగులో టీడీపీ మహిళా కార్యకర్తలు తనపై దాడి చేస్తున్నారని ఆరోపించారు… .

జేఏసీ పేరుతో తిరిగే వాళ్లకు కారం ప్యాకెట్లు ఎందుకు పట్టుకుని తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు… వెంటనే చంద్రబాబు నాయుడును అలాగే లోకేశ్ లను అరెస్ట్ చేయాలని సురేష్ డిమాండ్ చేశారు…