మెగా హీరోలతో దిల్ రాజు మల్టీస్టారర్ ఎవరు హీరోలంటే

మెగా హీరోలతో దిల్ రాజు మల్టీస్టారర్ ఎవరు హీరోలంటే

0
116

టాలీవుడ్ లో పెద్ద చిత్రాలు ఇప్పుడు నిర్మితమవుతున్నాయి.. దాదాపు సెట్స్ పై ఉన్న చిత్రాలు చూస్తే 12 సినిమాలు అని తెలుస్తోంది… పెద్ద పెద్ద బ్యానర్లు అన్నీ వరుస పెట్టి సినిమాలు స్టార్ట్ చేశాయి.. చాలా వరకూ ఉగాది దాటిన తరువాత వేసవి నుంచి విడుదలకు సిద్దం అవుతున్నాయి.

ఈ సమయంలో హిట్ నిర్మాతగా ఉన్న దిల్ రాజు కూడా కొత్త సినిమా నిర్మించేందుకు రెడీ అవుతున్నారు.. అది కూడా మల్టీస్టారర్ తీయబోతున్నారట, అంతేకాదు మెగా హీరోలతో ఈ మల్టీస్టారర్ ఉంటుంది అని తెలుస్తోంది.
ఎవరు సినిమా దర్శకుడు వెంకట్ రామ్జీ డైరెక్షన్లో ఈ మల్టీస్టారర్ తెరకెక్కనుందట.

ఈ సినిమాకి సంబంధించి కధ సిద్దం అవుతోందట, నిర్మాతగా దిల్ రాజు మాత్రమే ఉండనున్నారు అని తెలుస్తోంది.వరుణ్తేజ్, సాయితేజ్లతో ఈ సినిమా తీయనున్నారట,అయితే కథ లైన్ వినిపించారని ఇంకా మార్పులు చేర్పులు చేసి అంతా పూర్తి అయ్యాక వారిద్దరికి వినిపించనున్నారు అని తెలుస్తోంది.