బస్సులో అమ్మాయి సింగిల్ గా ఉండటంతో కండెక్టర్ దారుణమైన పని చేశాడు

బస్సులో అమ్మాయి సింగిల్ గా ఉండటంతో కండెక్టర్ దారుణమైన పని చేశాడు

0
103

అమ్మాయిలకి రక్షణ లేకుండా పోతోంది… ఎక్కడ చూసినా ఒంటరిగా అమ్మాయిలు కనిపిస్తే వేధించే పోకిరీలు చాలా మంది ఉంటున్నారు. తాజాగా కర్ణాటకలో ఓ ఆర్టీసీ కండెక్టర్ చేసిన పని షాక్ కి గురిచేసింది, ఓ యువతి ఆర్టీసీ బస్సు ఎక్కింది.. ఈ సమయంలో బస్సు చేరే చివరి స్టాప్ వరకూ ఆమె టికెట్ తీసుకుంది.. ఇలా అందరూ వారి స్టేషన్ రాగానే దిగిపోయారు. ఇక బస్సులో ఆమె మాత్రమే ఉంది.

ఈ సమయంలో కండెక్టర్ ఆమె పక్కన కూర్చుని ఆమెని తాకేలా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడు… వద్దు అని వారించినా ఆమె వినిపించుకోలేదు.. దీంతో అతను చేస్తున్న పనిని వీడియో తీసింది, ఇక బస్సు దిగిన వెంటనే అతని నీచ బుద్దిని కేఎస్ ఆర్టీసీకి పంపింది.

అంతేకాదు ఆమె సోషల్ మీడియాలో ఈ పోస్టు పెట్టి అతని గురించి తెలిపింది… దీంతో కర్ణాటక ఆర్టీసీ అధికారులు అతనిని ఉద్యోగం నుంచి తొలగించారు ..అతనిపై చర్యలు తీసుకుంటున్నారు, అయితే బస్సులో మరెవరూ లేకపోవడంతో ఆమె ఎవరికి చెప్పలేక వీడియో తీసింది అని తెలుస్తోంది.