ఏపీలో రాజ్యసభ సందడి స్టార్ట్ అయిందనే చెప్పాలి, తాజాగా నోటిఫికేషన్ షెడ్యూల్ కూడా వచ్చేసింది, దీంతో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు అనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పది మంది వరకూ ఈ రాజ్యసభ పదవుల రేసులో ఉన్నారు అని తెలుస్తోంది.
ఇక ఇప్పటికే తెలుగుదేశం జనసేన పార్టీలకు ఈ ఛాన్స్ లేదు.. ఉన్నా నాలుగుస్ధానాలు కూడా వైసీపీకి దక్కుతాయి.. దీంతో మరి ఆశావహల పేర్లు వైరల్ అవుతున్నాయి… సీఎం జగన్ సోదరి షర్మిల, మెగాస్టార్ చిరంజీవి…నెల్లూరుకు చెందిన బీసీ నేత బీద మస్తాన్ రావు. అలాగే టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి.
మంత్రులు మెపిదేవి వెంకటరమణ… పిల్లి సుభాష్ చంద్రబోస్… గోకరాజు రంగరాజు..మంచు మోహన్ బాబు..లక్ష్మీ పార్వతి..లక్ష్మీ
మండలి ఛీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.సినీ నటుడు అలీ. పేర్లు వినిపిస్తున్నాయి, బీసీ ఎస్సీ ఎస్టీలకు మైనార్టీకి అవకాశం ఇస్తారు అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.