బాలయ్య బోయపాటి రీమిక్స్ సాంగ్ ఏ సినిమా అంటే

బాలయ్య బోయపాటి రీమిక్స్ సాంగ్ ఏ సినిమా అంటే

0
83

బాలయ్య బాబు కథానాయకుడిగా ఇప్పుడు బోయపాటితో సినిమా చేస్తున్నారు, అయితే ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు అభిమానులు.. ఇక ఇందులో బాలయ్య కవలల పాత్ర అని అలాగే అఘోరా పాత్ర బాలయ్య చేస్తున్నారు అని ..ఒకరు కాశీలో ఉంటే మరొకరు అనంతపురంలో ఉంటారు అని అనేక వార్తలు ఈ సినిమా గురించి వినిపిస్తూ ఉన్నాయి, అయితే బోయపాటి ఈ సినిమాలో బాలయ్య లుక్ పై చాలా కేర్ తీసుకున్నారట.

బాలకృష్ణ సరసన నాయికలుగా శ్రియ .. అంజలిని ఎంపిక చేశారు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా గురించి మరో అప్ డేట్ వచ్చింది, అవును బాలయ్య పాత సాంగ్ రీమీక్స్ చేయబోతున్నాడు అనేది సరికొత్త వార్త, ఇది అభిమానులని చాలా ఆనందం కలిగించింది.

స్వాతిలో ముత్యమంత ఒకటి. బంగారాబుల్లోడు సినిమాలోని ఆ పాట ఇప్పటికీ హుషారెత్తించే పాటనే. ఆ పాటను రీమిక్స్ చేస్తే అభిమానులు ఖుషీ అవుతారని బాలకృష్ణకి తమన్ చెప్పాడట.అందుకే బాలయ్య ఈ సాంగ్ రీ మేక్ చేస్తారట.. అయితే ఇది బాలయ్య అంజలి కలిసి చేయనున్నారట. ఇప్పటికే రెండు విజయాలు చూసిన వీరి కాంబో మూడో హిట్ చిత్రం కోసం రెడీ అవుతోంది.