తెలంగాణలో రెండు రాజ్యసభ సీట్లను భర్తీ చేయనున్నారు అయితే ఈ సీట్ల కోసం ఇప్పటికే గులాబీ పార్టీలో ఆశావాహుల లిస్ట్ పెరిగిపోయింది. ఇప్పటికే ఓ సీటుని కేసీఆర్ కుమార్తె కవితకు ఇవ్వనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి, మరో సీటు ఎవరికి అనేది చర్చ…
రేసులో ఉన్నా నాయకులు చూస్తే కె.కేశవరావుకు వయసు రీత్యా ఈసారి అవకాశం ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. ఇక ఖమ్మం పార్టీ నాయకుడు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి, అలాగే సీనియర్ నేత మండవ వెంకటేశ్వరావు, తుమ్మల నాగేశ్వరరావు…సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య.
కడియం శ్రీహరి, మాజీ ఎంపీ మంద జగన్నాథం … గాదరి బాలమల్లు, సీతారాంనాయక్ .. హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి పేర్లు తెరపైకి వస్తున్నాయి, అయితే వీరిలో కచ్చితంగా కవితకు ఓసీటు ఇస్తే మరో పదవి ఎవరికి ఇస్తారు అనేది చర్చ జరుగుతోంది.