శృతిహసన్ కు ఆపరేషన్

శృతిహసన్ కు ఆపరేషన్

0
117

శృతిహసన్ ఇటీవల సినిమాలకు దూరం అయింది.. తాజాగా మళ్లీ సినిమాలు చేస్తోంది, ఆమెకు అనారోగ్యం కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది అని వార్తలు వినిపించాయి. రవితేజ హీరోగా రూపొందుతున్న క్రాక్ సినిమాలో నటిస్తోంది.
అయితే శ్రుతి కొత్తలుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బక్కపల్చగా, మొహంలో మార్పులతో సరికొత్త లుక్తో శ్రుతి కనిపిస్తోంది.

అయితే ఆమె తాజాగా సర్జరీ ఏదో కచ్చితంగా చేయించుకుంది అని అంటున్నారు ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది అని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, దీనిపై శృతి క్లారిటీ ఇచ్చింది.ఇతరుల అభిప్రాయాలకు అనుగుణంగా నేను ప్రవర్తించను. నేను ప్రస్తుతం చెప్పబోయే విషయం ప్రతి మహిళా ఎదుర్కొనేదే. హార్మోన్ల సమస్య కారణంగా నేను తరచుగా శారీరకంగా, మానసికంగా అసౌకర్యానికి గురవుతున్నా.

అందుకే ఆరోగ్యంగా ఉండేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా అని ఆమె తెలిపింది. నన్ను నేను ఎప్పుడు ప్రేమించుకుంటా అని తెలిపింది, మొత్తానికి ఆమె సర్జరీ చేయించుకుంది అనే విషయం బాగానే డేర్ గా చెప్పింది అంటున్నారు అభిమానులు.