మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు సెట్స్ పై 152వ చిత్రం పెట్టారు.. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు, ఇక తాజాగా కొన్ని వార్తలు వినిపించాయి, ఏమిటింటే ..ఆయన ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత లూసిఫర్ సినిమాలో నటిస్తారని, అంతేకాదు ఆ సినిమాని సుకుమార్ డైరెక్ట్ చేయబోతున్నారని అలాగే చరణ్ నిర్మాతగా ఉంటారు అని వార్తలు వినిపించాయి.
అయితే లూసిఫర్ చిత్రం టాలీవుడ్ లో కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అని భావిస్తున్నారు అందరూ, ఈ సమయంలో సుకుమార్ ఇప్పటికే బన్నీతో సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు, మరి సుకుమార్ లూసిఫర్ కు పనిచేసే అవకాశం లేదట, అందుకే కొత్త దర్శకుడికి అప్పగించాలి అని చూస్తున్నారు.
లూసిఫర్ రీమేక్ కోసం ముందు వంశీ కూడా ట్రై చేశారు అని వార్తలు వినిపించాయి, కాని తాజాగా వి.వి.వినాయక్ డైరెక్ట్ చేసే అవకాశాలున్నాయట…. చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150ను వినాయక్ డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. పైగా ఇప్పుడు వినాయక్ ప్రస్తుతం కథల పనిలో ఉన్నారు, అందుకే ఆయన చేత ఈ సినిమా చేయించాలి అని చూస్తున్నారట. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది.