పెద్ద తప్పు చేసిన చార్మీ వెంటనే క్షమాపణ కోరింది ఇంతకీ ఏం చేసిదంటే

పెద్ద తప్పు చేసిన చార్మీ వెంటనే క్షమాపణ కోరింది ఇంతకీ ఏం చేసిదంటే

0
123

సెలబ్రిటీలు చేసే పనులు కాస్త ఆచితూచి చేయాలి.. లేకపోతే అసలుకే మోసం వస్తుంది.. వీరిని ఫాలో అయ్యేవారు చాలా మంది ఉంటారు, అందుకే వారు చేసే ప్రతీ పని ఆలోచించి చేయాలి.. వారి పిలుపు కొన్ని లక్షల మంది విని ఫాలో అవుతారు. తాజాగా నటి నిర్మాత చార్మీ చేసిన చిన్న మిస్టేక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

చైనాని వణికిస్తున్న కరోనా వైరస్ తెలంగాణకి పాకింది, అయితే ఈ సమయంలో నేడు ఈ వార్త విని వెంటనే చార్మీ కాస్త వెటకారంతో ఆల్ ది బెస్ట్ అంటూ ఓ టిక్ టాక్ వీడియో చేసింది, వెంటనే దీనిపై చాలా నెగిటీవ్ కామెంట్లు వచ్చేశాయి. ఇదేం వీడియో అని విమర్శలు చేశారు అందరూ.

అయితే వెంటనే ఆ పోస్టును తొలగించింది చార్మీ . కాసేపటి తర్వాత ట్విట్టర్ లో స్పందించిన చార్మీ, జరిగిన దానిపై క్షమాపణలు చెప్పింది. ఆ వీడియో పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తూ పోస్టయిన అన్ని కామెంట్లు చదివాను. ఎంతో సున్నితమైన అంశంపై పరిణతి లేకుండా స్పందించినందుకు క్షమాపణలు తెలుపుకుంటున్నాను అంది… ఇలాంటి తప్పులు మళ్లీ జరగవు అని చెప్పింది చార్మీ, అయితే తన తప్పు తెలుసుకున్నందుకు చాలా మంది పాజిటీవ్ గా ఆమెకి కామెంట్లు పెట్టారు.