కథ వినకుండానే ఓకే చెప్పేసిన హీరో

కథ వినకుండానే ఓకే చెప్పేసిన హీరో

0
82

హీరో విశ్వంత్ కేరింత సినిమా తో టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు.. తరువాత మనమంతా సినిమా తో ఫేమస్ అయ్యాడు.. ప్రతి పాత్రలో తనను తాను నిరూపించుకున్నాడు..జెర్సీ సినిమా లో హారో నాని కి కొడుకుగా చాల బాగా నటించాడు.. ప్రస్తుతం హీరో విశ్వంత్ ఓ పిట్టకథ సినిమా లో ప్రముఖ పాత్రను పోషించాడు..

ఈ సినిమా లో నటించిన ప్రతి పాత్రకి ఒక చిన్న పిట్టకథ ఉంటుందని చెప్పాడు.. గ్రామీణ నేపథ్యం లో విభిన్న పాత్రలతో ఈ చిత్రం ఉంటుందట.చంద్రశేఖర్ యేలేటి ముందుగా ఈ కథ విన్నారట.. అయితే ఆయన ఈ కథ బాగుంది అనడంతో , ఆయనపై నమ్మకంతో కథ వినకుండానే సినిమా ఒప్పుకున్నాడు ఈ హీరో ..అయితే ఓ కొత్త తరహాలో ఈ సినిమా ఉంటుందని ఇలాంటి సినిమా ఎప్పుడు చూసి వుండరని హీరో విశ్వంత్ తన మాటల్లో చెప్పాడు.. ఈ సినిమా ఈ నెల 6 న రిలీజ్ కానుంది.. ఈ సినిమా తప్పకుండ హిట్ అవుతుందనే చెబుతున్నారు…