తెలుగులో పవన్ పింక్ సినిమా రీమేక్ లో నటిస్తున్నారు , ఈ సినిమా గతంలో హిందీలో వచ్చింది ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో తెరకెక్కిస్తున్నారు, నిర్మాత దిల్ రాజు బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, ఇక పవన్ కల్యాణ్ ఈ సినిమా షూటింగులో రోజూ పాల్గొంటున్నారు, అనుకున్నట్లే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది.
ఈ సినిమాలో నివేదా థామస్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది.ఈ సినిమాకి ఆమె పాత్ర హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు చిత్ర యూనిట్ …అంతేకాదు ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా ఎమోషన్ తో సాగేలా ఉంటుందట. అభిమానులకి ఈ పాత్ర బాగా నచ్చుతుంది అని చెబుతున్నారు.
అందుకే ఆమెని ప్రత్యేకంగా తీసుకున్నారట ఈచిత్రానికి .. అంతేకాదు చిత్ర యూనిట్ అనుకున్న విధంగా ఆమె ఈ పాత్రకి పూర్తి న్యాయం చేస్తోందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు…. ఈ సినిమా తరువాత నివేదా కెరియర్ గ్రాఫ్ మరింత పెరిగిపోవడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో పవన్ కూడా ఆమె నటనకి ఫిదా అయ్యారట.