ప్రముఖ సింగర్ బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పై నిన్న రాత్రి ఓ పబ్ లో బీర బాటిళ్లతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంగతి తెలిసిందే… అయితే ఈ ఘటనపై ఆయన కానీ ఆయన తల్లిదండ్రులు కానీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు…
అయితే తాజాగా రాహుల్ గచ్చిబౌళి పోలీసులకు ఫిర్యాదు చేశారు… తనతో పాటు మహిళలపట్ల కొందర అసభ్యంగా ప్రవర్తించారని రాహుల్ ఫిర్యాదులో పేర్కొన్నారు…
కాగా దాడి జరిగిన తర్వాత రాహుల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని అటునుంచి అటే తన ఇంటికి వెళ్ళిపోయాడని పోలీసులు తెలిపారు… ఈ విషయంపై పబ్ యాజమాన్యం ఫిర్యాదు చేసిందని తెలిపారు… పబ్ లో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు…