ఫ్లాష్ న్యూస్… కరోనా ఎఫెక్ట్ నేటి నుంచి ఈనెల 31 వరకూ స్కూళ్లకు సెలవులు

ఫ్లాష్ న్యూస్... కరోనా ఎఫెక్ట్ నేటి నుంచి ఈనెల 31 వరకూ స్కూళ్లకు సెలవులు

0
101

కరోనా రోజు రోజుకు దేశంలో విస్తరిస్తోంది 28 పాజిటీవ్ కేసుల నుంచి 31 కేసులు నమోదు అయ్యాయి… ఇక అనుమానిత కేసులు కూడా చాలా వరకూ పెరుగుతున్నాయి… వారికి పది రోజుల వరకూ ఆరోగ్య పరిస్దితి తెలిస్తే కాని చెప్పలేరు, ఈ సమయంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు చెబుతున్నారు.. మరీ ముఖ్యంగా కరోనా దిల్లీలో విస్తరిస్తోంది.

అందుకే అక్కడ ముందస్తు చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 31వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించినట్టు రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ప్రకటించారు.

దీనిని తప్పకుండా అన్నీ స్కూళ్లు పాటించాలి అని తెలిపారు, ఇక అన్ని స్కూళ్లకు ఈ నోటిసులు పంపించాలి అని తెలిపారు. అంతేకాదు స్పెషల్ క్లాసులు లాంటివి ఎక్కడా ఏర్పాటు చేయకూడదు అని సీరియస్ గా తెలిపారు, దీంతో నేటి నుంచి అక్కడ 31 వరకూ స్కూళ్లు తెరవరు అని పేరెంట్స్ కి మెసేజ్ లు పంపిస్తున్నారు.