వైయస్ భారతికి విశాఖలో ఇళ్లు చూపించారట – ఏమన్నారంటే

వైయస్ భారతికి విశాఖలో ఇళ్లు చూపించారట - ఏమన్నారంటే

0
78

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ రాజధాని అమరావతి నుంచి ఇప్పుడు పరిపాలన రాజధాని విశాఖని మార్చారు, అయితే తాజాగా విశాఖకు కార్యాలయాలని కూడా తరలించాలి అని చూస్తున్నారు, అయితే ఆమె తాజాగా విశాఖని సందర్శించారట.

సీఎం జగన్ ఎలాగో పరిపాలన ఇక్కడ నుంచి చేస్తారు కాబట్టి విశాఖలో ఎక్కడ ఉండాలి? ఏ ఇంట్లో నివాసం ఉండాలన్న అంశానికి సంబంధించిన పని మీదనే తాజాగా విశాఖ వచ్చారు అని టాక్ నడుస్తోంది, ఇక సీఎం ఫ్యామిలీ ఉండేందుకు కొన్ని ఇళ్లులు చూశారు అధికారులు..

వాటిని వైయస్ భారతీకి చూపించారట… నౌకాశ్రయ గెస్ట్ హౌస్ తో పాటు.. రుషికొండలోని కొన్ని విశాలమైన భవనాల్ని చూపించారు. భీమిలిలోని జూట్ మిల్ గెస్ట్ హౌస్ ను కూడా చూపించినట్లుగా తెలుస్తోంది.
అయితే వీటిలో ఏ ఇళ్లు ఆమెకి నచ్చలేదు అని వార్తలు వస్తున్నాయి, మరి ఇది ఎంత వరకూ వాస్తవమో చూడాలి.