ఎన్టీఆర్ సినిమాలో రష్మికతో పాటు మరో టాప్ హీరోయిన్ ఫిక్స్

ఎన్టీఆర్ సినిమాలో రష్మికతో పాటు మరో టాప్ హీరోయిన్ ఫిక్స్

0
104

తాజాగా టాలీవుడ్ లో ఓ త్రివిక్రమ్ సినిమా గురించి చర్చ జరుగుతోంది. ఇక తదుపరి సినిమా ఎన్టీఆర్ తో అని ప్రకటన కూడా వచ్చేసింది..ఇక స్టోరీపై ఆయన బాగా ఫోకస్ చేస్తున్నారు, అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే హీరోయిన్ గురించి కూడా చర్చ జరుగుతుంది ఇప్పటికే అరవింద సమేతలో నటించిన పూజాని మరోసారి రిపీట్ చేస్తారు అని అనుకున్నారు.

కాని రష్మికని తీసుకుంటారు అని వార్తలు వచ్చాయి.. అయితే ఇప్పుడూ రష్మికతో పాటు మరో బ్యూటీని కూడా తీసుకోవాలి అని చూస్తున్నారు.. అయితే ఇక్కడ హిట్ కొడుతున్న హీరోయిన్స్ కాదు అని, ఉత్తరాధిన ఎందుకు అని దర్శుకుడు త్రివిక్రమ్ ఆలోచిస్తున్నారు, అందుకే సమంత పేరు ఇప్పుడు వినిపిస్తోంది.

ఎన్టీఆర్ సరసన ఒక నాయికగా సమంతను తీసుకోవాలనే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నాడని అంటున్నారు. ఆ పాత్రకి సమంత అయితేనే సరిగ్గా సరిపోతుందని ఆయన భావిస్తున్నాడని చెబుతున్నారు. ఇటు త్రివిక్రమ్ దర్శకత్వంలోను .. అటు ఎన్టీఆర్ కాంబినేషన్లోను నటించిన అనుభవం సమంతకి వుంది. ఇక గతంలో ఆమె త్రివిక్రమ్ తో మూడు సినిమాలు చేసింది దీంతో ఆమెకి ఛాన్స్ ఉంది అంటున్నారు