తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాతే ఆంధ్రప్రదేశ్ లో సామాజిక న్యాయం వెల్లివిరిసిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్దసంఖ్యలో పదవులు ఇవ్వడమే కాకుండా.. బీసీలు, మహిళలకు రిజర్వేషన్లు కల్పించి, వారిని రాజ్యాధికారంలో భాగస్వాములను చేసిన ఘనత ఎన్టీఆర్ దే గుర్తు చేశారు…
చట్టసభల్లో, ప్రభుత్వ విధానాల్లో బీసీల భాగస్వామ్యాన్ని దూరం చేసే కుట్ర ఇది. వైసీపీ పెత్తందారీ పోకడలపై, అణచివేతలపై ఆ పార్టీ ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలే కన్నీళ్లు పెట్టే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు… బడుగు బలహీన వర్గాల హక్కులను వైసీపీ కాలరాసినా, కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ సిద్దంగా ఉందని తెలిపారు..
అందుకే ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి 34% పైగా స్థానాలను బీసీలకు కేటాయించాం. రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని పరిరక్షించుకునేందుకు బీసీలందరూ ఏకంకావాలి. అంబేద్కర్ మాట, ఎన్టీఆర్ బాట, తెలుగుదేశం సిద్దాంతం… “సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్ళు అన్నారు…