ఆయన ఒక మానసిక రోగి – శ్రీ రెడ్డి

ఆయన ఒక మానసిక రోగి - శ్రీ రెడ్డి

0
122

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో నానా రచ్చ చేసి మీడియాలో హైలైట్ అయిన నటి శ్రీరెడ్డి.. ఇప్పుడు సినీ ప్రముఖులను టార్గెట్ చేసి వార్తల్లో నిలుస్తోంది. రీసెంట్ గా మహానటి సినిమాలో టైటిల్ రోల్ పోషించిన కీర్తి సురేష్ ను నానా మాటలు అన్న శ్రీరెడ్డి.. ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ నటుడిపై పడింది.

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ పై శ్రీరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆయన ఒక మానసిక రోగి అంటూ అభివర్ణించింది. మీరు త్వరగా ఓ మెంటల్ హాస్పిటల్ లో చేరండి అంటూ సూచించింది. ‘’ఆడవాళ్లకు మర్యాద అనే పదమే మీ డిక్షనరీలోనే లేదనే విషయం నాకు తెలుసు. త్వరలోనే మీ బండారం బయటపెడుతా’’ అంటూ శ్రీరెడ్డి రాజేంద్ర ప్రసాద్ కు వార్నింగ్ ఇచ్చింది. కాగా, రాజేంద్ర ప్రసాద్ పై ఇంత ఘాటు వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు మాత్రం శ్రీరెడ్డి చెప్పలేదు.