సూపర్ స్టార్ మహేష్‌బాబు మాస్టర్ మణిరత్నం ఈజ్ బ్యాక్ అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. మణిరత్నం సినిమా నవాబ్‌ను కాలర్ ఎగరేసుకుని చూశానని చెప్పాడు.అయితే, ఇటీవల విడుదలైన నవాబ్ సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తమిళనాడులో కేవలం నాలుగు రోజుల్లోనే రూ.30 కోట్లను రాబట్టింది.
ఈ నేపథ్యంలో సినిమాపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు మహేష్‌బాబు.మణిరత్నం అభిమానిగా ఆయన సినిమాలను చెన్నై థియేటర్‌లో చూసి క్లాప్స్ కొట్టేవాడినని, ఇప్పుడు నవాబ్ చిత్రం చూస్తున్నప్పుడు కూడా అలానే చేశానని చెప్పాడు మహేష్‌బాబు. మాస్టర్ ఈజ్ బ్యాక్ అంటూ ట్వీట్ చేశాడు.