ఎమ్మెల్యేగా చేసి మళ్లీ సర్పంచ్ గా నిజంగా గ్రేట్ అనాల్సిందే..

ఎమ్మెల్యేగా చేసి మళ్లీ సర్పంచ్ గా నిజంగా గ్రేట్ అనాల్సిందే..

0
89

ఈరోజుల్లో ఏ రాజకీయ నాయకుడు అయినా కచ్చితంగా ఎమ్మెల్యేగా చేస్తే మంత్రి లేదా ఎంపీ లేదా ఎమ్మెల్సీ అవ్వాలి అని అనుకుంటారు.. మరీ చిన్న పోస్టులు నామినేటెడ్ పోస్టులు చేయడానికి ఇష్టపడరు, అలాగే జెడ్పీ ఎంపీటీసీ ఇలా ఆ పదవులు తీసుకోవడానికి ఇష్టపడరు.

కాని ఎమ్మెల్యేగా చేసి ఇప్పుడు సర్పంచ్ గా చేయడం అంటే అది సామాన్య విషయం కాదు, నిజమైన ప్రజాసేవ అంటే ఇదే అని చెప్పాలి..కడప జిల్లాలో తొలి మహిళా ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ ఆమె వయసు 80 సంవత్సరాలు.. అయినా ఆమె జనాల్లో ఉంటారు. 1972 నుంచి ఆమె రాజకీయాల్లో ఉన్నారు.

ఇప్పటివరకూ ఆరుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 1978, 1983, 2004 ఎన్నికల్లో రాజంపేట ఎమ్మెల్యేగా పొందారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. అయితే ఆమెకు ప్రజల్లో ఉండటం ఇష్టం.. తమ గ్రామం పెనగలూరు మండలం కొండూరు సర్పంచ్గా తర్వాత కొనసాగాల్సి వచ్చింది. 1995-2000 మధ్యకాలంలో ఆమె కొండూరు సర్పంచ్గా పనిచేశారు.