అందుకే ఒక్కోసారి నేలపై పడుకుంటా – మెగాస్టార్ చిరంజీవి

అందుకే ఒక్కోసారి నేలపై పడుకుంటా - మెగాస్టార్ చిరంజీవి

0
98

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి వచ్చే ప్రతీ ఒక్కరికి ఓ సినిమా దేవుడిగానే చెబుతారు, ఎన్నో కష్టాలని ఓర్చి ఈ స్దాయికి వచ్చారు ఆయన, అయితే ఖైదీ నంబర్ 150 చిత్రంతో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు, ఇక సైరా కూడా ఇటీవల సూపర్ సక్సెస్ అందించింది, ఇక తాజాగా ఆయన కొరటాల శివతో సినిమా చేస్తున్నారు.

ఇక ఈ చిత్రానికి ఆచార్య అనే టైటిల్ ఫైనల్ అయింది, ఇక టాలీవుడ్ కి ఇప్పుడు పెద్ద దిక్కుగా మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు అనే చెప్పాలి, ఆయన ఈ మధ్య చాలా ఫంక్షన్లకు అటెండ్ అవుతున్నారు. సినిమాలకు సంబంధించి అనేక ఫంక్షన్లకు ఇప్పుడు మెగాస్టార్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు.

తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ఎక్కడికి ఫంక్షన్ కు వచ్చినా మిమ్మల్ని అందరూ పొగుడుతారు కదా మరి మీరు ఎలా వాటిని స్వీకరిస్తారు అని ప్రశ్నిస్తే, అది స్వీకరిస్తా ఏదైనా సినిమా విజయం సాధించింది అంటే అది చిత్ర యూనిట్ అందరి కృషి, అలాగే సినిమా హిట్ అవ్వలేదు అంటే అది సమిష్టిగా అందరి బాధ్యత అని నేను నమ్ముతా అని చెప్పారు చిరు.

ఫంక్షన్లలో తనను ఎవరైనా ప్రశంసిస్తే వాటికే పొంగిపోనని, ఇంటికి వెళ్లగానే నేలపై పడుకుంటానని వెల్లడించారు. గర్వం తలకెక్కకుండా ఉండేందుకు అలా నేలపై పడుకుంటానని వివరించారు. కేవలం నా వల్లే సినిమా హిట్ అయిందని నేను ఇప్పటి వరకూ ఏ నాడు భావించలేదు అని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి.