సంచలన విషయాలు బయటపెట్టిన మారుతీరావు కారు డ్రైవర్

సంచలన విషయాలు బయటపెట్టిన మారుతీరావు కారు డ్రైవర్

0
82

మారుతీరావు ఆత్మహత్య కేసుపై పోలీసులు విచారణ జరుపుతున్నారు, అయితే ఆయన ఆత్మహత్యపై పలు అనుమానాలు ఉన్న సమయంలో ఈ కేసు విచారణ చాలా లోతుగా చేస్తున్నారు.. మారుతీరావు ఆత్మహత్య కేసులో ఆయన కారు డ్రైవర్ రాజేశ్ను సైఫాబాద్ పోలీసులు ప్రశ్నించారు.

అసలు ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకున్నారు, మిర్యాల గుడ నుంచి మారుతీరావు నేను బయలుదేరాము, మధ్యలో తెలిసిన వారి ఫెస్టిసైడ్స్ షాపు దగ్గర ఆగాము, ఆ దుకాణంలోకి వెళ్లకుండానే ఆయన వెనక్కి వచ్చారు అని చెప్పాడు డ్రైవర్ రాజేశ్…ఇక ఇద్దరం ఖైరదాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ కు చేరుకున్నాం, అక్కడ ఇద్దరం కలిసి బయట టిఫిన్ చేశాము.

తర్వాత మళ్లీ తనను బయటకు పంపి ఆయనకు ఇష్టమైన గారెలు తెప్పించుకుని తిన్నాడని వివరించాడు. నేను మీతో రూమ్ లో పడుకుంటాను అని చెప్పాను, అయినా మారుతీరావు ఒప్పుకోలేదని, కిందికి వెళ్లి కారులో పడుకోమని చెప్పడంతో వెళ్లిపోయానని పోలీసులకు తెలిపాడు. ఇకమారుతీరావు కాల్ డేటా డ్రైవర్ కాల్ డేటా కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.