తెలుగుదేశం పార్టీకి వరుసగా ఎమ్మెల్యేలు గుడ్ బై చెబుతున్నారు.. ఇప్పటికే మద్దాల గిరి, వల్లభనేని వంశీ పార్టీకి గుడ్ బై చెప్పారు, తాజాగా మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.. రమేష్ బాబు, రామసుబ్బారెడ్డి, సతీష్ రెడ్డి ఇలా చాలా మంది ఈ వారం తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు.. ఇంకా పలువురు నేతలు ఈ జాబితాలో ఉన్నారు అని అంటున్నారు.
తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన చీరాల ఎమ్మెల్యే కరణం బలారం కూడా పార్టీకి గుడ్ బై చెబుతారు అని వార్తలు వస్తున్నాయి..చంద్రబాబు పార్టీ తరపున తనకు అంత ప్రయారిటీ ఇవ్వలేదు అని నచ్చిన చోట కాకుండా వేరే చోట సీటు ఇచ్చారు అనే బాధ ఆయనలో ఉంది.. గతంలో సీనియర్ అయిన తనకు మంత్రి పదవి ఇవ్వలేదు అని బాధ ఉంది.
అయితే ఇప్పుడు టీడీపీ పరిస్దితి మరింత దారుణంగా ఉంది.. ఈ సమయంలో ఆయనకు వైసీపీ నుంచి ఆహ్వనం కూడా వచ్చిందట.. నేడు లేదా రేపు ఆయన వైసీపీలో చేరుతారు అని తెలుస్తోంది.. అంతేకాదు ఒంగోలు మేయర్ పదవి కుమారుడు కరణం వెంకటేష్ కు వచ్చే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి.