పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన త్రిష

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన త్రిష

0
100

ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు పెళ్లి మాట ఎత్తితే ఆమడ దూరం వెళుతున్నారు.. ఇంకా చాలా సమయం ఉంది అంటున్నారు.. అప్పుడే పెళ్లి ఎందుకు అంటున్నారు, ఇక సీనియర్ హీరోయిన్లు కూడా చాలా మంది ఇదే దారిలో ఉన్నారు. వారిలో కాజల్ అనుష్క ముందు వరసలో ఉన్నారు.. ఇక త్రిష కూడా చాలా సినిమాలు చేసింది. టాలీవుడ్ కోలీవుడ్ లో ఆమె ఎంతో పాపులర్ హీరోయిన్.

అయితే తాజాగా ఆమె పెళ్లి గురించి కొన్ని కామెంట్లు చేసింది.. పెద్దలు చూసిన అబ్బాయిని తాను పెళ్లి చేసుకోనని, ప్రేమించే పెళ్లి చేసుకుంటానని హీరోయిన్ త్రిష చెప్పింది. అందాల తార త్రిష తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… తాను పెళ్లి చేసుకుంటాను కానీ, తన పెళ్లి విషయంలో కుటుంబ పెద్దలు చెప్పే మాటను వినబోనని తేల్చి చెప్పింది, నాకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది.

నన్ను బాగా చూసుకోవాలి నన్ను బాగా అర్ధం చేసుకోవాలి అని చెప్పింది, అంతేకాదు తనకు వచ్చే అబ్బాయి హీరో కానక్కర్లేదు అని అలాగే చాలా అందంగా ఉండాలనే కోరిక లేదు అని చెప్పింది. అయితే త్రిష మాటలు చాలా మంది అమ్మాయిలు అవును అంటున్నారు, అలాంటి భర్త వస్తే ఏ అమ్మాయికి అయినా హ్యపీ అంటున్నారు,.