మారుతీరావు అమృత కేసు గురించి ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు… చివరకు ఆమె ప్రేమ పెళ్లి ఇరువురి మరణాలకు కారణం అయింది అని ఆమెని విమర్శిస్తున్నారు, అయితే ఈ క్షణికావేస సంఘటనలకు ఆమెని బాధ్యురాలిని చేయడం ఏమాత్రం సరైనది కాదు.. తాజాగా కొందరు కావాలనే అసలు అమృత మారుతీరావు కూతురు కాదు అని విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు.
అయితే ఇందులో ఎంత వాస్తవం ఉంది అని ఓ మీడియా ఛానల్ ఆమె బాబాయ్ శ్రవణ్ ని ప్రశ్నించింది, ఈ సమయంలో పూర్తి విషయాలు చెప్పారు శ్రవణ్. మారుతీరావు మా వదినకు పుట్టిన బిడ్డ అమృత.. ఇక్కడ జ్యోతి హస్పిటల్ లో ఆమె పుట్టింది, ఇది అందరికి తెలుసు మా బంధువులకి తెలుసు. డాక్టర్ కు తెలుసు, కావాలంటే రికార్డులు చూసుకోండి.3
కావాలనే కొందరు హైప్ తెచ్చుకోవడానికి మీడియాలలో ఇలాంటి వార్తలు వదులుతున్నారు.. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు, ఆమె సొంత కూతురు కాబట్టే అంత ప్రేమ పెంచుకున్నాడు అని చెప్పారు శ్రవణ్, అయితే ఇలాంటి అవాస్తవాలు వైరల్ అవడం పై ఆయన కాస్త కలతచెందారు.