హీరోయిన్ కళ్యాణి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ఏం చేస్తుందో తెలుసా

హీరోయిన్ కళ్యాణి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ఏం చేస్తుందో తెలుసా

0
95

హీరోయిన్ కళ్యాణి కెరియర్లో ఎన్నో మంచి హిట్ సినిమాలు చేసింది, ఆమెకి మంచి పేరు కూడా పలు తెలుగు సినిమాలు తీసుకువచ్చాయి..అలాగే చిత్రాలు నటిస్తూ ఫ్యామిలీ హీరోయిన్ గా ముద్ర వేసుకుంది..ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ కేరళ కుట్టి , మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది.

శేషు సినిమాతో మంచి పేరు సంపాదించింది, బాల నటిగా కూడా మళయాల సినిమాలు చేసింది. ఇక సౌత్ ఇండియాలో పలు భాషల్లో ఆమె చిత్రాలు చేసింది..ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు చిత్రంలో నటనకు ఆమెకి నంది అవార్డు వచ్చింది. అంతేకాదు టాలీవుడ్ బిగ్ హీరోలు వెంకటేష్, రవితేజ,జగపతిబాబు లాంటి నటులతో పలు సినిమాలు నటించింది.

ఇక కల్యాణ్ జగపతి బాబు చిత్రాలు సూపర్ హిట్ అనే చెప్పాలి. ఇక లక్ష్యం సినిమాలో కూడా ఆమె వివాహం తర్వాత నటించింది, ఇక అక్క వదిన పాత్రలకు మాత్రమే ఇప్పుడు పరిమితం అయింది.తాజాగా నటి కల్యాణి దర్శకురాలిగా పరిచయం కాబోతోంది.
చేతన్ శీను అనే హీరోను సినిమాలకు పరిచయం చేస్తున్నారు.ఇక ఆమెని మలయాళ పరిశ్రమలో కావేరీగా పిలుస్తారు, అందుకే ఆమె పేరును ఈ చిత్రానికి కావేరీ కల్యాణీగా పరిచయం చేసుకుంటున్నారు. ఇక కల్యాణి సత్యం సినిమా దర్శకుడు సూర్యకిరణ్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.