వైసీపీలోకి ఆగని వలసలు…

వైసీపీలోకి ఆగని వలసలు...

0
96

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది… ఇప్పటికే చాలామంది టీడీపీ, జనసేన నేతలు వైసీపీ తీర్ధం తీసుకున్న సంగతి తెలిసిందే తాజాగా రాజధాని ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకులు వైసీపీ తీర్థం తీసుకున్నారు.. పార్టీలో చేరేందుకు వచ్చిన టీడీపీ నాయకులను ఎమ్మెల్యే విడుదల రజని వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు…

పార్టీలో చేరిన తర్వాత వీరు మీడియాతో మాట్లాడుతూ తాము ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై వైసీపీ తీర్ధం తీసుకున్నామని తెలిపారు… స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తమవంతు కృషి చేస్తామని తెలిపారు…

కాగా విడుదల రజని 2019 ఎన్నికల ముందు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ తీర్థం తీసుకున్నారు… ఆ ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు… ఇప్పుడు ఆమె వైసీపీ ఫైర్ బ్రాండ్ గా మారారు…