తెలంగాణతో పాటు ఏపీని కూడా కరోనా వైరస్ కలకలం రేపుతోంది… తాజాగా కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన సాదు శంకరయ్యకు కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానంతో వైద్య సిబ్బంది కడప ఆసుపత్రికి తరలించారు…
పదిరోజుల క్రితం కువైట్ నుంచి శంకరయ్య స్వగ్రామంలోని ఇంటికి చేరాడు ఇతనికి రెండు రోజుల క్రితం నుంచి దగ్గు జలుబు జ్వరం ఉందని స్థానికులు వాలెంటీర్లకు ఆశావర్కర్లకు సమాచారం ఇచ్చారు…
దీంతో వైద్య సిబ్బంది అప్రమత్తమైయ్యారు… కరోనా వైరస్ ఉందా లేదా వైద్య పరీక్షలు నిర్వహించడానికి అప్రమత్తమైన వెద్య యంత్రాంగం కడప నుంచి పత్యేక టీం వచ్చి శంకరయ్య రిమ్స్ కు తరలించారు…