వైరస్ గురించి మాస్క్ వాడుతున్నారా ఈ విషయాలు తెలుసుకోండి

వైరస్ గురించి మాస్క్ వాడుతున్నారా ఈ విషయాలు తెలుసుకోండి

0
99

కరోనా వైరస్ రాకుండా ఉండాలి అని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు జనం, అయితే ముఖ్యంగా ప్రతీ ఒక్కరు మాస్క్ ధరిస్తున్నారు, ఎదైనా అనుమానం వస్తే జ్వరం జలుబు వస్తే మాస్క్ వాడండి అని అవసరం లేకపోతే ఈ మాస్క్ వాడక్కర్లేదు అని చెబుతున్నారు, ఇది సరిగ్గా వాడకపోతే మరిన్ని సమస్యలు వస్తాయి అంటున్నారు .

.. మీరు ముఖానికి పెట్టుకున్న మాస్క్ను ఒకసారి తీస్తే…దానిని వెంటనే డస్ట్బిన్లో వేయాలే గానీ, దానిని మరోసారి వినియోగించకూడదు, ఇక మాస్క్ చాలా వరకూ కొత్తవి వాడండి, ఇతరులు ఒకసారి వాడిన మాస్క్ మీరు వాడకండి.
ఒకే మాస్క్ను గంటలు రోజులు తరబడి వినియోగించడం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయి.

మాస్క్ ధరించి బయటకు వెళ్లిన తరువాత ఇంటికి వచ్చేంత వరకు దాని జోలికి వెళ్లకూడదని, కనీసం చేయి కూడా తగిలించకూడదు, మాస్క్ పెట్టుకున్న వారు టీ తాగుతూ మాస్క్ పైన పెట్టుకోవడం లాంటివి చేయకండి, అలాగే మాస్క్ వేసుకునేముందు చేయి కడుక్కోవాలి మాస్క్ తీశాక కూడా శుభ్రం చేసుకోవాలి.