హైదరాబాద్ వాసులు పోలీసులని సర్కారుని ఒకటి అడుగుతున్నారు?

హైదరాబాద్ వాసులు పోలీసులని సర్కారుని ఒకటి అడుగుతున్నారు?

0
81

తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో చాలా వరకూ హస్టల్స్ ఉన్నాయి, ఇందులో అమీర్ పేట ఎస్సార్ నగర్ లో దాదాపు 900 వరకూ హస్టల్స్ ఉన్నాయి.. అయితే కాలేజీలు స్కూల్లు ఇనిస్టిట్యూట్స్ మూసివేశారు కాబట్టి చాలా వరకూ హస్టల్స్ లో ఆ స్టూడెంట్స్ ఉంటున్నారు.. మరికొందరు ఇంటికి వెళ్లిపోయారు.

అయితే తాజాగా హస్టల్స్ కూడా ఖాళీ చేయాలి అని స్టూడెంట్స్ ని ఖాళీ చేయించాలి అని హస్టల్ యజమానులకి చెబుతున్నారు.. కరోనా వల్ల ఈ నిర్ణయం అని చెబుతున్నారు, ఒకే ఇంత వరకూ బాగానే ఉంది.. ఇప్పుడు ఉన్న హస్టల్స్ లో కోచింగ్ తీసుకునే వారు సగం మంది ఉంటే చిన్న ఉద్యోగాలు చేసుకునే వారు బతుకు బండి లాగుతున్న చిరు కార్మికులు చాలా మంది ఉన్నారు.

మరి వారు ఎక్కడకి వెళ్లాలి అనేది పెద్ద ప్రశ్న.. ఇప్పుడు హస్టల్ యజమానులు కూడా ఇదే ప్రశ్నిస్తున్నారు. వారు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలి అప్పుడు ఖాళీ చేస్తాం అంటున్నారు, అలాగే 15 రోజులు హస్టల్స్ ఉండవు కాబట్టి ఓనర్లు కూడా పూర్తి రెంట్ ఇవ్వమంటారని అంటున్నారు, అయితే ఇక్కడ దాదాపు లక్షలాది మంది చిరు ఉద్యోగులు హస్టల్ లో ఉంటున్నారు.. వారు అందరూ కూడా ఇప్పుడు సర్కారుని అధికారులని ప్రశ్నిస్తున్నారు.. మరి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.