ఫ్లాష్ న్యూస్.. క‌రోనా పై సీఎం ప‌లు కీల‌క నిర్ణ‌యాలు

ఫ్లాష్ న్యూస్.. క‌రోనా పై సీఎం ప‌లు కీల‌క నిర్ణ‌యాలు

0
75

దేశంలో క‌రోనా డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది, ఈ స‌మ‌యంలో ప‌లు రాష్ట్రాలు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి, ఇప్ప‌టికే స్విమ్మింగ్ పూల్స్ క్లోజ్ అయ్యాయి, అలాగే దేశంలో చాలా రాష్ట్రాల్లో స్కూల్లు కాలేజీలు క్లోజ్ చేశారు, అలాగే మాల్స్ కూడా పూర్తిగా ష‌ట్ట‌ర్ క్లోజ్ లో ఉన్నాయి.

ఇలా ప్ర‌తీ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు, తాజాగా ఏపీ తెలంగాణ‌లో కూడా ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు, స్కూల్స్ కాలేజీల‌కు సెల‌వు ఇచ్చారు ఈ నెల 31 వ‌ర‌కూ.. తాజాగా మ‌హ‌రాష్ట్రాలో కూడా ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది అక్క‌డ స‌ర్కార్.

మహారాష్ట్రలో మరో ఇద్దరు మహిళలకు కరోనా వైరస్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. ముంబైకు చెందిన 68 ఏళ్ల వృద్ధురాలికి, పూణెకు చెందిన 28 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో, మహారాష్ట్రలో కరోనా బారినపడ్డ వారి సంఖ్య 44కు చేరింది. దీంతో సీఎం ప‌లు కీలక నిర్ణ‌యాలు తీసుకున్నారు.

‌‌
50 శాతం ప్రభుత్వ ఉద్యోగులు రోజు విడిచి రోజు ఆఫీసుల‌కి రావాలి
ముంబయి బస్సుల్లో 50 శాతం ప్రయాణికుల సామర్థ్యమే ఉండాలి
ప్రయాణికుల మధ్య దూరం పాటించాలి.. నిల్చుని ప్రయాణించవద్దు
నిర్ణీత సమయాల్లోనే దుకాణాలు తెరవాలి
స్కూల్లు కాలేజీలు మాల్స్ 31 వ‌ర‌కూ మూసివేయాలి
ప్రతీ దుకాణాల్లో మాస్క్ శానిటైజ‌ర్లు త‌క్కువ రేట్ల‌కి అమ్మాలి
జ్వ‌రం ఉండే అస‌లు బ‌య‌ట‌కు రాకూడ‌దు అని తెలిపారు.