నిర్భయ కేసులో నలుగురు దోషులని నేడు ఉదయం ఉరి తీశారు, చివరి వరకూ ఉరి నుంచి తప్పించుకోవాలి అని చేసిన వీరి ప్రయత్నాలు అన్నీ ఫెయిల్ అయ్యాయి, చివరకు ఇన్ని సంవత్సరాలు వీరు ఉరి నుంచి తప్పించుకుని చివరకు చనిపోయారు.
అయితే చివరకు వీరి నలుగురు కొద్ది రోజులుగా ఒంటరిగా దిగాలుగానే ఉన్నారు, అయితే వీరిని ఎప్పుడో చివరి కోరిక అడిగారు… వారు ఎవరూ తమ కోరిక చెప్పలేదు, కుటుంబ సభ్యులని కూడా కలవాలి అని కోరలేదు, దీంతో జైలు అధికారులు కుటుంబ సభ్యులకి కూడా పిలుపు పంపలేదు. కాని ఉరికంబం ఎక్కేముందు కూడా మీ చివరి కోరిక చెప్పండి అని జైలు అధికారులు అడిగారు.
కాని వారు నలుగురు మాత్రం ఒకేసారి మౌనం దాల్చారు ఎవరూ ఏమీ మాట్లాడలేదు, పశ్చాత్తాపం వారి కళ్లల్లో కనిపించిందట. దోషులు ముఖేశ్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31)లలో ఏ ఒక్కరు కూడా తమ చివరి కోరికను వెల్లడించలేదు, దీంతో అధికారులు కూడా వారిని అలాగే ఉరికంబానికి వేలాడదీశారు సుమారు అరగంట పాటు వారిని ఉంచారు అని తెలుస్తోంది.