మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో సీనియర్ నటుడు, టాప్ హీరో అనే చెప్పాలి.. ఇలా టాలీవుడ్ లో చిరంజీవి వేసిన పూ బాటలో ఇప్పటి మెగా హీరోలు ఎందరో స్టార్ హీరోలు అయ్యారు. అయితే అన్నయ్య చిరంజీవి మాట టాలీవుడ్ లో ఎవరూ జవదాటరు.. అయితే ఆయన కుటుంబం నుంచి సోదరులు సినిమాల్లోకి వచ్చారు.. ఇక ఆయన కుమార్తె కుమారుడు కూడా సినిమా పరిశ్రమలో ఉన్నారు.
అయితే తాజాగా చిరు పెద్ద కుమార్తె తన తమ్ముడు చరణ్ గురించి కొన్ని విషయాలు చెప్పారు, సుస్మిత సైరా నరసింహారెడ్డి సినిమాకు కాస్ట్యూమ్స్ డిజైనర్గా పనిచేసింది. ఇక బన్నీచరణ్ ఇద్దరిలో ఎవరు బెస్ట్ డ్యాన్సర్ అంటే బన్నీ అని చెప్పింది ఆమె.తండ్రీ కొడుకులుగా ఉన్నపుడు చిరంజీవి మాటలను జవదాటని రామ్ చరణ్.. నిర్మాతగా మాత్రం తనకు నచ్చిన విధంగా చేస్తాడు అంటోంది,
ఇక చరణ్ తనకు ఎలా కావాలో అలా స్టోరీ రప్పించుకుంటారు, అవుట్ పుట్ సరిగ్గా వచ్చే వరకూ వదిలిపెట్టడు.. చాలా డెడికేషన్ గా వర్క్ చేస్తాడు అని ఆమె తెలిపింది. ఇక నాన్న కొన్ని విషయాలు వినకపోతే నువ్వే నాన్నని ఒప్పించాలి అని ఆర్డర్ వేసి వెళ్లిపోతాడు అని చరణ్ గురించి ఆమె తెలిపారు. సో వర్క్ విషయంలో చెర్రీ అంత పవర్ ఫుల్ అంటున్నారు అభిమానులు.